Team India: మా జనాభా కంటే వీళ్లు 20 రెట్లు ఎక్కువ... టీమిండియా విక్టరీ పరేడ్ కు వచ్చిన జనాన్ని చూసి ఐస్ లాండ్ క్రికెట్ బోర్డు ఆశ్చర్యం

Iceland Cricket Board funny comment on Team India victory parade
  • టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశం చేరుకున్న టీమిండియా
  • నిన్న ముంబయిలో విక్టరీ పరేడ్
  • హాజరైన లక్షలాది మంది అభిమానులు
టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి వచ్చిన టీమిండియాకు నిన్న సాయంత్రం ముంబయిలో లభించిన స్వాగతం చరిత్రలో నిలిచిపోతుంది. ముంబయి మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు టీమిండియా ఆటగాళ్లను ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపుగా తీసుకువెళ్లగా... ఈ విక్టరీ పరేడ్ కు లక్షల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. 

దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. అందులో ఒక ఫొటోను చూసిన ఐస్ లాండ్ దేశ క్రికెట్ బోర్డు నోరెళ్లబెట్టింది. వామ్మో... ఇంత జనమా!... మా దేశ జాతీయ జనాభా కంటే టీమిండియా వరల్డ్ కప్ పార్టీకి హాజరైన జనం 20 రెట్లు ఎక్కువ అని సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేసింది.
Team India
Victory Parade
Mumbai
Iceland Cricket

More Telugu News