Chandrababu: హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు... తెలంగాణలో ఘన స్వాగతం... వీడియో ఇదిగో

Chandrababu Naidu arrives at Begumpet Airport
  • ఢిల్లీ పర్యటన ముగిశాక బేగంపేటకు చేరుకున్న ఏపీ సీఎం
  • కారులో నుంచి అభివాదం చేసిన చంద్రబాబు
  • జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు ర్యాలీగా వెళ్లిన టీడీపీ అధినేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు అభిమానులతో ర్యాలీ నిర్వహిస్తున్నారు.

ఢిల్లీ పర్యటన ముగియడంతో ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజా భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కానున్నారు. హైదరాబాద్ నగరమంతా చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు.

విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇది మొదటిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని సంస్థల విభజనపై చర్చించే అవకాశముంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. తమకు ఏపీ ప్రభుత్వం రూ.24 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతుండగా, తమకే రూ.7 వేల కోట్లు వస్తాయని ఏపీ చెబుతోంది.
Chandrababu
Telugudesam
Telangana
Hyderabad

More Telugu News