Raj Tarun: ప్రేమించి మోసం చేశాడంటూ హీరో రాజ్ తరుణ్ పై యువతి ఫిర్యాదు

Lavanya alleges Raj Tarun cheated her pretext of marriage
  • చిక్కుల్లో పడిన రాజ్ తరుణ్!
  • రాజ్ తరుణ్, తాను 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామన్న లావణ్య
  • పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, మరో హీరోయిన్ తో సంబంధంలో ఉన్నాడని ఆరోపణ
  • కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు!
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు! రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. రాజ్ తరుణ్, తాను గత 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని లావణ్య వెల్లడించింది. 

రాజ్ తరుణ్ కు, తనకు ఓ గుడిలో పెళ్లయిందని, అయితే హీరోయిన్ తో అఫైర్ కారణంగా తనను వదిలేశాడని లావణ్య వివరించింది. రాజ్ తరుణ్ సోదరుడు కూడా తనను బెదిరించాడంటూ ఆమె ఆరోపించింది. ఈ మేరకు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

కాగా, లావణ్యను ఈ ఏడాది ఆరంభంలో వెలుగుచూసిన ఓ డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు నార్సింగిలో అరెస్ట్ చేశారు. 

అయితే, తనను కొందరు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని, వాస్తవానికి ఆ డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని లావణ్య తాజా ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. డ్రగ్స్ కేసులో తాను 45 రోజుల పాటు జైల్లో ఉంటే రాజ్ తరుణ్ తనను పట్టించుకోలేదని కూడా ఆమె వాపోయింది.
Raj Tarun
Lavanya
Cheating
Police
Tollywood

More Telugu News