మచిలీపట్టణంలో రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ.. త్వరలోనే అధికారిక ప్రకటన
- పెట్రోలియం శాఖ మంత్రితో చంద్రబాబు భేటీ
- రూ. 60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు
- పోర్టు అందుబాటులో ఉండడం, రాజధానికి సమీపంలో ఉండడం కలిసొచ్చే విషయాలు
- పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
- మచిలీపట్టణం అభివృద్ది చెందుతున్న జనసేన ఎంపీ బాలశౌరి
పోర్టు అందుబాటులో ఉండడం, రాజధానికి దగ్గర ఉండడం కలిసి వస్తుందని చెప్పారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రూ. 60 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే రిఫైనరీ నాలుగేళ్లలో పూర్తవుతుంది. దీని ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, రిఫైనరీ ఏర్పాటుతో మచిలీపట్టణం ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని బాలశౌరి తెలిపారు.