Nara Lokesh: ఆ బిల్లుల కోసం గుడివాడ గడ్డం గ్యాంగ్ తీవ్ర ప్రయత్నాలు చేసింది: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh take a dig at YCP leaders
గత వైసీపీ పాలనలో గుడివాడలో గడ్డం గ్యాంగ్ ఇష్టానుసారంగా దోపిడీ చేసిందంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్లను మంజూరు చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారని, ఆఖరికి టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో నిమ్మకాయ నీళ్ల పేరిట రూ.28 లక్షలు దోచుకున్నారని మండిపడ్డారు. 

బిల్లుల కోసం గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేశారని, రూ.70 లక్షల విలువైన ఈ బిల్లుల కోసం గడ్డం గ్యాంగ్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అమృత్ పథకంలో పనులు చేయకుండానే డబ్బులు కొల్లగొట్టారని అన్నారు. 

జనం సొమ్ము అయితే చాలు... గడ్డం గ్యాంగ్ కు అడ్డు అదుపు ఉండదని, దోచుకోవడమే పని అని నారా లోకేశ్ విమర్శించారు. గడ్డం గ్యాంగ్ దోపిడీకి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని స్పష్టం చేశారు. 

దోపిడీకి హద్దు లేదా జగన్? ప్రజాధనాన్ని పందికొక్కులా మెక్కడానికి సిగ్గులేదా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Nara Lokesh
Gudivada
TDP
YSRCP

More Telugu News