Chandrababu: ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు... రేపు ఉదయం ప్రధానితో భేటీ

Chandrababu to meet PM Modi tomorrow
  • రేపు ఉదయం 10.15కు ప్రధానితో భేటీ కానున్న చంద్రబాబు
  • ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించనున్న ఏపీ సీఎం
  • అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లతోనూ భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 10.15 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. పోలవరం, అమరావతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి నివేదిక ఇవ్వనున్నారు.

ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం

చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర పునర్నిర్మాణానికి దోహదపడే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్తామనే ఉద్దేశంతోనే ప్రజలు తమ కూటమికి 164 సీట్లు ఇచ్చారన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం అందరి బాధ్యత అన్నారు.
Chandrababu
Andhra Pradesh
Narendra Modi
BJP

More Telugu News