నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు
- బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి చంద్రబాబు
- గురువారం ప్రధానితో సమావేశం
- విభజన హామీలు సహా పలు అంశాల్లో కేంద్ర సహకారం కోరనున్న బాబు
- వచ్చే బడ్జెట్‌లో ఏపీకి మేలు చేకూర్చే కేటాయింపులకు విజ్ఞప్తి చేసే ఛాన్స్
ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని, సంబంధిత శాఖ మంత్రులను విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబు వెంట వెళ్లనున్నారు.