Heavy Rain: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం

Heavy rain lashes some parts of Hyderabad city
హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా నగరంలోని పలు ప్రాంతాలు భారీ వర్షంతో తడిసి ముద్దయ్యాయి. 

జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, బేగంపేట, కేపీహెచ్ బీ కాలనీ, దిల్ సుఖ్ నగర్, ప్రగతి నగర్, హైదర్ నగర్, బోయిన్ పల్లి, నిజాంపేట్, మైత్రీవనం, యూసఫ్ గూడ, పంజాగుట్ట, బోరబండ, ఉప్పల్, ఎల్బీనగర్, రామంతపూర్, హయత్ నగర్, తిరుమలగిరి, ఎల్బీనగర్, బొల్లారం, అమీర్ పేట, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగింది.
Heavy Rain
Hyderabad
Weather
Monsoon

More Telugu News