Team India: టీమిండియాకు రూ.125 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి జై షా

BCCI Secretary Jay Shah announces Rs 125 crores for Team India
  • టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా
  • టీమిండియాపై అభినందనల వెల్లువ
  • టీమిండియా బృందానికి తియ్యని కబురు చెప్పిన జై షా
ఐసీసీ టైటిళ్ల కరవు తీర్చుతూ టీమిండియా టీ20 వరల్డ్ కప్-2024లో విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో చాంపియన్స్ గా అవతరించడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

తాజాగా, బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియాకు రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించారు. ఈ విషయాన్ని జై షా స్వయంగా వెల్లడించారు. ఈ టోర్నీ ఆసాంతం టీమిండియా అద్భుతమైన ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తి కనబర్చిందని కొనియాడారు. ఆటగాళ్లందరికీ, కోచింగ్ సిబ్బందికి, ఇతర సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జై షా పేర్కొన్నారు. టీమిండియాకు రూ.125 కోట్ల నజరానా ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు.
Team India
Prize
Jay Shah
BCCI
T20 World Cup 2024

More Telugu News