IPS: ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు స్థానచలనం

Three senior IPS officials transfered in AP
  • విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ బదిలీ
  • సీఐడీ అదనపు డీజీగా అయ్యన్నార్ నియామకం
  • విశాఖ సీపీగా శంఖబ్రత బాగ్చీ
  • ఏసీబీ డీజీగా అతుల్ సింగ్
ఏపీలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ ను సీఐడీ అడిషనల్ డీజీగా బదిలీ చేశారు. 

ఏపీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీ అతుల్ సింగ్ ను యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) డీజీగా బదిలీ చేశారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ శంఖబ్రత బాగ్చీని విశాఖ పోలీస్ కమిషనర్ గా నియమించారు. 

ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు స్థానచలనం కలగడం తెలిసిందే.
IPS
Transfer
Andhra Pradesh
TDP-JanaSena-BJP Alliance

More Telugu News