Asaduddin Owaisi: ఢిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి.. నల్ల ఇంకు చల్లిన దుండగులు

Asaduddin Owaisi Alleges His Delhi Residence Vandalised
  • ఎక్స్‌లో వీడియో పోస్టు చేసిన ఒవైసీ
  • ఇలాంటి వాటితో తనను భయపెట్టలేరని వ్యాఖ్య
  • అమిత్ షా, స్పీకర్ ఓంబిర్లా కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపణ
గుర్తు తెలియని దుండగులు కొందరు నిన్న ఢిల్లీలోని తన నివాసంపై దాడిచేసి ధ్వంసం చేశారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. నివాసంపై నల్ల ఇంకు చల్లారని ఆరోపించారు. తన ఇంటిపై ఇప్పటి వరకు ఎన్నిసార్లు దాడి జరిగిందో లెక్కేలేదని పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ విషయంలో తామేమీ చేయలేమని ఢిల్లీ పోలీసులు చేతులెత్తేశారని పేర్కొన్నారు. 

హోంమంత్రి అమిత్ షా, స్పీకర్ ఓం బిర్లా కనుసన్నల్లోనే ఇది జరిగిందని, ఎంపీల భద్రతకు గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు. తన ఇంటిపై దాడిని సావర్కర్ తరహా పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇలాంటివి తనను భయపెట్టలేవని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని తాను ఎన్నో చూశానని, ఇంకు చల్లి, రాళ్లు విసిరితే తాను భయపడే రకం కాదని స్పష్టం చేశారు.
Asaduddin Owaisi
Delhi Residence
Vandalised
MIM

More Telugu News