Rohit Sharma: మ్యాచ్ అనంత‌రం రోహిత్ శ‌ర్మ భావోద్వేగం.. కోహ్లీ చేసిన ప‌నికి అంద‌రూ ఫిదా.. వీడియో వైర‌ల్‌!

Rohit Sharma Wipes Tears As India Reach T20 World Cup Final Virat Kohli Reaction Is Gold
  • ఇంగ్లండ్‌తో రెండో సెమీస్‌లో టీమిండియా 68 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం
  • మొద‌ట బ్యాటింగ్‌లో ఆ త‌ర్వాత బౌలింగ్‌లో రాణించిన రోహిత్ సేన
  • టీమిండియా ఫైన‌ల్ చేరిన ఆనందంలో సార‌ధి రోహిత్ శ‌ర్మ భావోద్వేగం
  • విజ‌యం త‌ర్వాత‌ డగౌట్‌లో కూర్చొని క‌న్నీళ్లు పెట్టుకున్న హిట్‌మ్యాన్‌ 
  • రోహిత్‌ భుజం త‌ట్టి ఉత్సాహ‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నించిన విరాట్ కోహ్లీ
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో సెమీ ఫైన‌ల్‌లో టీమిండియా 68 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లింది. మొద‌ట బ్యాటింగ్‌లో ఆ త‌ర్వాత బౌలింగ్‌లో రాణించిన రోహిత్ సేన ఇంగ్లిష్ జ‌ట్టును ఈజీగా ఓడించింది. ఇక టీమిండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ చేరిన ఆనందంలో సార‌ధి రోహిత్ శ‌ర్మ భావోద్వేగానికి గురయ్యాడు. డగౌట్‌లో కూర్చొని క‌న్నీళ్లు పెట్టుకున్న అత‌డిని కోహ్లీ భుజం త‌ట్టి ఉత్సాహ‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

కాగా, ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. 39 బంతుల్లో 57 పరుగులు చేసిన రోహిత్‌.. త‌న టీ20 అంత‌ర్జాతీయ కెరీర్‌లో 32వ హాఫ్ సెంచ‌రీని న‌మోదు చేశాడు. అటు సూర్య‌కుమార్ యాద‌వ్ (47) తో క‌లిసి మంచి భాగ‌స్వామ్యాన్ని అందించ‌డంతో టీమిండియా 171 ప‌రుగుల భారీ స్కోర్ చేయ‌గ‌లింది. ఆ త‌ర్వాత అక్సర్ ప‌టేల్‌, కుల్‌దీప్ యాద‌వ్‌, జ‌స్ప్రీత్ బుమ్రా వేసిన అద్భుతమైన స్పెల్‌లు ఇంగ్లండ్‌ను 103 పరుగులకే ప‌రిమితం చేశాయి. ఈ విజ‌యంతో ఫైన‌ల్ చేరిన భార‌త జ‌ట్టు శ‌నివారం ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది.
Rohit Sharma
Virat Kohli
Team India
T20 World Cup 2024
Cricket
Sports News

More Telugu News