Telugu: తెలుగులో ప్రమాణం చేసిన తమిళనాడు కృష్ణగిరి ఎంపీ

Tamilnadu MP takes oath in Telugu
  • పార్లమెంట్‌లో రెండోరోజు ఎంపీల ప్రమాణ స్వీకారం
  • ఎంపీలతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్
  • మాతృభాషల్లో పలువురు ఎంపీల ప్రమాణం
తమిళనాడులోని కృష్ణగిరి లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ గోపినాథ్ పార్లమెంట్‌లో తెలుగులో ప్రమాణం చేశారు. లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం రెండోరోజు కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణం చేయిస్తున్నారు. పలువురు ఎంపీలు తమ తమ మాతృభాషల్లో ప్రమాణం చేస్తున్నారు. అయితే కృష్ణగిరి ఎంపీ తెలుగులో ప్రమాణం చేశారు. కృష్ణగిరి ఆంధ్రప్రదేశ్‌ను అనుకొని ఉంటుంది. ఇక్కడ తమిళుల తర్వాత అత్యధికంగా తెలుగు వారు, ఆ తర్వాత కన్నడవారు ఉంటారు.
Telugu
Lok Sabha
Tamil Nadu

More Telugu News