రాజభవనాల రక్షణ కోసం ఏకంగా ప్రత్యేక చట్టమా?: జగన్ పై దేవినేని ఉమ పైర్
- కిమ్ ను మించిన పెత్తందారీ జగన్
- ఇంట్లో ఉంటేనే 986 మందితో సెక్యూరిటీ
- బయటకు వెళితే అంతకు మూడు రెట్ల భద్రత
తన కుటుంబం, తన రాజభవనాల రక్షణకోసం ప్రత్యేక చట్టం చేయడంతో పాటు తన నివాస పరిసరాల్లో 48 చెక్ పోస్టులు, రిక్టాట్రబుల్ గేట్లు, బూమ్ బారియర్లు, టైర్ కిల్లర్లు, బోలార్డ్స్ లాంటి విస్తు గొలుపే అనవసర చర్యలు తీసుకున్నారని విమర్శించారు. తన తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలో జరిగిన అత్యాచారం, అరాచకాలను మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల భద్రత గాలికి వదిలేసి వారి సొమ్ముతో విలాసాలు అనుభవించే నువ్వు పెత్తందారివి కాక మరేమిటి? అంటూ ఉమ విమర్శించారు.