Drugs: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్

Ganja gang creates ruckus in mylardevpalli
మైలార్‌దేవ్‌పల్లిలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్ ఓ హెయిర్‌సెలూన్‌పై దాడికి పాల్పడింది. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసింది. షాపు యజమానిపై కూడా పిడిగుద్దులు కురిపించారు. తొలుత సెలూన్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు కటింగ్ చేయించుకున్నారు. ఆ తరువాత డబ్బులు అడిగిన యజమానిపై ఘర్షణకు దిగారు. మమ్మల్నే డబ్బులు అడుగుతావా? అంటూ నానా హంగామా సృష్టించారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులపై కూడా దాడి చేశారు. ఈలోపు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికే నిందితులు పరారయ్యారు. గంజాయి మత్తులోని వారు స్థానికులపై కూడా దాడి చేస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Drugs
Hyderabad
Crime News

More Telugu News