Gudivada Amarnath: నాటి కూల్చివేతల వల్లే నేడు ప్రతిపక్షంలో ఉన్నాం: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్

former minister gudivada amarnath on ycp loss in elections
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన కూల్చివేతల వల్లే నేడు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. విలేకరులు అడిగిన  ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఎండాడ న్యాయకళాశాల రోడ్డులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ముందుగా అనుమతుల అంశంపై కార్యాలయం గోడకు జీవీఎంసీ అధికారులు అంటించిన నోటీసును చదివి, ఆ తరువాత ఆయన తొలగించారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, ఎమ్మెల్సీ వి. కళ్యాణి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
Gudivada Amarnath
YSRCP
Andhra Pradesh
Telugudesam

More Telugu News