Reels: రీల్స్ కోసం వెర్రితలలు వేస్తున్న యువత... హైదరాబాదులో ఒళ్లు గగుర్పొడిచే ఘటన!

Youth dares to make reels turned bizarre some times
  • సోషల్ మీడియాలో గుర్తింపు కోసం యువత పెడత్రోవ
  • ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తున్న యువతీయువకులు
  • హైదరాబాదులో నడుస్తున్న బస్సు కింద పడుకున్న యువకుడు
సోషల్ మీడియాలో గుర్తింపు కోసం యువత కొన్నిసార్లు పెడత్రోవ పడుతోంది. ముఖ్యంగా, రీల్స్ కోసం యువతీయువకులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసాలు చేస్తుండడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. హైదరాబాదులో ఓ యువకుడు రీల్స్ కోసం నడిరోడ్డుపై వెళుతున్న బస్సు కింద పడుకున్నాడు. 

సిటీ బస్సు వస్తుండగా ఎదురెళ్లిన యువకుడు ఒక్కసారిగా రోడ్డుపై పడుకున్నాడు. అయితే, అతడు నిలువుగా పడుకోవడంతో బస్సు టైర్లు అతడిపై ఎక్కలేదు. బస్సు వెళ్లిపోగానే అతడు ఎంచక్కా లేచి పక్కకి వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.

More Telugu News

Reels
Youth
Adventures
Hyderabad
Social Media