Kandula Durgesh: ఏపీలో సినిమా స్టూడియోలు నిర్మించండి: నిర్మాతలకు మంత్రి కందుల దుర్గేశ్ ఆహ్వానం

AP Cinematography minister Kandula Durgesh ivites producers to build studios in AP
  • ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్
  • నేడు బాధ్యతలు చేపట్టిన మంత్రి
  • కోనసీమను సినిమా షూటింగ్ లకు అనువుగా తీర్చిదిద్దుతామని వెల్లడి
  • సినీ పరిశ్రమకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ
ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటకం, సాంస్కృతి శాఖల మంత్రిగా కందుల దుర్గేశ్ నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తన చాంబర్లో మాట్లాడుతూ, కోనసీమ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి సినిమా షూటింగ్ లకు అనువుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏపీలో సినిమా స్టూడియోల నిర్మాణానికి టాలీవుడ్ నిర్మాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు సంపూర్ణ సహకారం ఉంటుందని, సినీ ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు చేపట్టి, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. సినీ రంగానికి ఊతమిచ్చేలా తమ చర్యలు ఉంటాయని, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 

ఇక, రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజంను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు. కందుల దుర్గేశ్ ఇవాళ సచివాలయంలోని సెకండ్ బ్లాక్ లోని తన చాంబర్లో మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. 

అటు, రుషికొండ ప్యాలెస్ పైనా మంత్రి స్పందించారు. అంత ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టే బదులు పేదలకు ఆసుపత్రి కడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
Kandula Durgesh
Cine Studios
Producers
Cinematography
Tollywood
Janasena
Andhra Pradesh

More Telugu News