Revanth Reddy: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy praises Professor Jayashankar
  • రేపు జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం నివాళి
  • తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడన్న సీఎం
  • జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి జాగృతం చేశారన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రొఫెసర్ జయశంకర్ నిలిచిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఈరోజు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి జాగృతం చేశారని పేర్కొన్నారు. తుది శ్వాస వరకు జయశంకర్ తెలంగాణ ఏర్పాటు కోసం పరితపించారన్నారు.
Revanth Reddy
Congress
Jayashankar

More Telugu News