Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ చీఫ్ పల్లాకు బుల్లెట్ ప్రూఫ్ కారు.. ఎందుకో తెలుసా?

AP TDP Chief Palla Srinivasa Rao Gets Bullet Proof Car From Party
  • పల్లాను ఏపీ టీడీపీ చీఫ్‌గా నియమించిన చంద్రబాబు
  • రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సిన నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్‌కారు
  • ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌పై రికార్డు మెజార్టీతో పల్లా విజయం
ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పార్టీ అధిష్ఠానం బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై రికార్డు మెజార్టీతో విజయం సాధించి ఆయన వార్తల్లోకెక్కారు. ఇప్పటి వరకు ఏపీ టీడీపీ చీఫ్‌గా పనిచేసిన కింజరపు అచ్చెన్నాయుడుకు కేబినెట్‌లో చోటివ్వడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిని శ్రీనివాసరావుకు ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

శ్రీనివాసరావు తండ్రి సింహాచలం 1984 నుంచి టీడీపీలో ఉన్నారు.1994-99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. కార్మిక నాయకుడిగా టీడీపీ అనుబంధ విభాగం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (టీఎన్‌టీయూసీ) ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇక, 2014-19 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీనివాసరావు తాజాగా, రెండోసారి ఎన్నికయ్యారు.
Palla Srinivasa Rao
Andhra Pradesh
Telugudesam

More Telugu News