Chandrababu: రాజధాని ప్రాంతంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu will visit Amaravathi tomorrow
  • ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభం
  • రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలను పరిశీలించనున్న సీఎం
  • రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలోనూ సీఎం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి పర్యటనను ప్రారంభించనున్నారు. రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలను ఆయన పరిశీలిస్తారు. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి సందర్శించనున్నారు.

అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్డును పరిశీలిస్తారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు ప్రారంభించిన సైట్ల వద్ద పర్యటిస్తారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల స్థితిగతులను పరిశీలించి... అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభమవుతుంది.
Chandrababu
Telugudesam
Amaravati

More Telugu News