Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ.. వీడియో ఇదిగో!

Jana Sena Chief Pawan Kalyan Swearing As Deputy CM Of AP
  • విజయవాడ క్యాంపు కార్యాలయంలో పూజలు
  • అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతల స్వీకరణ
  • డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖల మంత్రిగానూ బాధ్యతలు
  • అనంతరం పలు ఫైళ్లపై సంతకాలు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగానూ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు.

బాధ్యతలు చేపట్టిన పవన్‌కు అధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పవన్‌ను కలిశారు.
Pawan Kalyan
Deputy CM
Andhra Pradesh
Janasena

More Telugu News