Nicholas Pooran: ఒకే ఓవర్‌లో 36 పరుగులు.. టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ తర్వాత మళ్లీ ఇప్పుడే!

West Indies equal T20 World Cup record in an onslaught against Afghanistan
  • ఆఫ్ఘనిస్థాన్‌పై పూరన్ పరుగుల వాన
  • మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు, మిగతా వన్నీ ఎక్స్‌ట్రాలే
  • టీ20లో ఇది ఐదోసారి.. ప్రపంచకప్‌లో రెండోసారి
టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో గత రాత్రి జరిగిన గ్రూప్-సి చివరి మ్యాచ్‌లో 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విండీస్.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డుతో పాటు ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సమం చేసింది.

అజ్మతుల్లా ఒమర్‌జాయ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో విండీస్ స్టార్ నికోలస్ పూరన్ ఏకంగా 36 పరుగులు పిండుకున్నాడు. ఓ ఓవర్‌లో 36 పరుగులు చేయడం టీ20ల్లో ఇది ఐదోసారి కాగా, టీ20 ప్రపంచకప్‌లో రెండోసారి.  టీ20 ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్‌లో టీమిండియా బ్యాటింగ్ స్టార్ యువరాజ్ సింగ్ ఇంగ్లండ్‌పై 36 పరుగులు పిండుకున్నాడు.

తాజా మ్యాచ్‌లో ఒమర్‌జాయ్ ఒక నోబాల్, ఐదు వైడ్లు వేయడంతోపాటు మూడు సికర్లు, రెండు ఫోర్లు సమర్పించుకున్నాడు. అజ్మతుల్లా వేసిన నాలుగో ఓవర్ తొలి బంతిని పూరన్ స్టాండ్స్‌లోకి తరలించాడు. రెండోబంతి నోబాల్ కావడంతో ఫ్రీ హిట్ వచ్చింది. ఆ తర్వాత 5 వైడ్లు వేశాడు. ఆ తర్వాతి బంతికి పరుగులేమీ రాలేదు. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు వచ్చాయి. దీంతో మూడో ఓవర్‌లో 37/1తో ఉన్న విండీస్ స్కోరు ఓవర్ ముగిసే సరికి 73/1కి చేరుకుంది.

టీ20 ప్రపంచకప్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు
 
36 పరుగులు (6,6,6,6,6,6) - స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ (ఇంగ్లండ్‌పై 2007లో)
36 పరుగులు (6,4nb,5wd,0,LB4,4,6,6) - అజ్మతుల్లా ఒమర్‌జాయ్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్ (ఆఫ్ఘనిస్థాన్‌పై 2024లో)
33 పరుగులు (wd,6,4,wd,nb,1nb,6,wd,1,6,4)- జెరీమీ గోర్డన్ బౌలింగ్‌లో ఆడ్రీస్ గౌస్ (కెనడాపై 2024లో) 
32 పరుగులు 32 runs (4,W,6nb,1nb,6,6,6,1) - ఇజాతుల్లా దవ్లత్‌జాయ్ బౌలింగ్‌లో లూక్ రైట్, జోస్ బట్లర్ (ఆఫ్ఘనిస్థాన్‌లో 2012లో) 
30 పరుగుల (4,1,4,6,6,4nb,4) - బిలావల్ భట్టి బౌలింగ్‌లో అరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (పాకిస్థాన్‌పై 2014లో) 

Nicholas Pooran
Yuvraj Singh
T20 World Cup 2024
Afghanistan
Team West Indies

More Telugu News