Pakistan: ఎంఎస్ ధోనీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్

Pakistan captain Babar Azam shattered MS Dhoni all time record in T20 World Cup history
  • 549 పరుగులతో టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా నిలిచిన బాబర్
  • రెండవ స్థానానికి పడిపోయిన ఎంఎస్ ధోనీ
  • ఐర్లాండ్‌పై ఓదార్పు విజయం సాధించిన పాకిస్థాన్
టీ20 వరల్డ్ కప్ 2024లో నాకౌట్ దశకు చేరకుండానే నిష్ర్కమించిన దాయాది దేశం పాకిస్థాన్‌కు ఒక ఓదార్పు విజయం దక్కింది. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఐర్లాండ్ నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని పాక్ 7 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. టార్గెట్ ఛేజింగ్‌లో ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ కీలక పాత్ర పోషించాడు. చివరి వరకు క్రీజులో ఉన్న బాబర్ ఆజమ్ 34 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా తను మాత్రం చక్కగా ఆడి పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో భారత మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ రికార్డును బాబర్‌ ఆజం బద్దలు కొట్టాడు.

టీ20 ప్రపంచ కప్‌లలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. ఐర్లాండ్‌పై 32 పరుగులతో టీ20 వరల్డ్ కప్‌లలో బాబర్ 17 మ్యాచ్‌ల్లో మొత్తం పరుగులు 549కి పెరిగాయి. ఇక 29 మ్యాచ్‌లు ఆడి 529 పరుగులు చేసి ఇంతకాలం తొలి స్థానంలో ఉన్న ధోనీని అతడు అధిగమించాడు. న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ మొత్తం 19 మ్యాచ్‌లు ఆడి 527 పరుగులు సాధించి ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.

టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు వీళ్లే..

1. బాబర్ ఆజం - 549 (17 మ్యాచ్‌లు)
2. ఎంఎస్ ధోనీ - 529 (29 మ్యాచ్‌లు)
3. కేన్ విలియమ్సన్ - 527 (19 మ్యాచ్‌లు)
4. మహేల జయవర్ధనే - 360 (11 మ్యాచ్‌లు)
5. గ్రేమ్ స్మిత్ - 352 (16 మ్యాచ్‌లు).
Pakistan
Babar Azam
MS Dhoni
T20 World Cup 2024
Cricket

More Telugu News