Bakrid: రేపు బక్రీద్... హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic restrictions will be imposed in Hyderabad tomorrow on the eve of Bakrid
  • జూన్ 17న బక్రీద్ పర్వదినం
  • మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
  • ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు వాహనాల మళ్లింపు
  • జూ పార్క్, అల్లాహో అక్బర్ మసీదు వద్ద పార్కింగ్ సదుపాయం
రేపు బక్రీద్ (జూన్ 17) పర్వదినం నేపథ్యంలో హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు  విధించారు. బక్రీద్ ప్రార్థనలు నిర్వహించే ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని అధికారులు తెలిపారు. 

మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో రేపు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు వాహనాలను దారిమళ్లిస్తామని వెల్లడించారు. ఈ సమయంలో పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ వైపు నుంచి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే బహదూర్ పురా క్రాస్ రోడ్ మీదుగా అనుమతిస్తామని అధికారులు వివరించారు. ప్రార్థనల నిమిత్తం వచ్చే వారి వాహనాల పార్కింగ్ ను నెహ్రూ జూ పార్క్, అల్లాహో అక్బర్ మసీదు  ముందు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 

పాతబస్తీలోని పలు రహదారులపై రాకపోకలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. దాదాపు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
Bakrid
Traffic Restrictions
Hyderabad
Police
Telangana

More Telugu News