Amaravati: అమరావతి అభివృద్ధి బాధ్యతను చంద్రబాబు నాపై ఉంచారు: మంత్రి నారాయణ

Minister Narayana says Chandrababu handed the responsibility of Amaravathi upon him
  • చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానన్న నారాయణ
  • అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని వెల్లడి
  • రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టీకరణ
ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి అభివృద్ధి బాధ్యతను చంద్రబాబు తనపై ఉంచారని వెల్లడించారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని అన్నారు. 

అమరావతిలో అనేక భవనాల నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయిందని నారాయణ వెల్లడించారు. పక్కా ప్రణాళికతో రెండున్నర సంవత్సరాల్లోనే ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

ఇక, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని వెల్లడించారు.
Amaravati
AP Capital
Chandrababu
Narayana
TDP
Andhra Pradesh

More Telugu News