Mujeeb Ur Rahman: టీ20 ప్రపంచకప్ సూపర్-8కి చేరిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఎదురుదెబ్బ.. జట్టుకు దూరమైన మిస్టరీ స్పిన్నర్

Afghanistan Spinner Mujeeb Ur Rahman ruled out for remainder of T20 World Cup
  • ఐపీఎల్‌లో ముజీబుర్ రెహ్మాన్ చేతి వేలికి గాయం
  • అది మరింత పెద్దది కావడంతో జట్టుకు దూరం
  • అతడి స్థానంలో హజ్రతుల్లా జాజాయ్‌కు చోటు
  • ముజీబుర్ పాత్రను పోషించనున్న నూర్ అహ్మద్
అద్వితీయమైన ఆటతీరుతో ఈసారి టీ20 ప్రపంచకప్ సూపర్-8కు చేరిన ఆఫ్ఘనిస్థాన్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. మిస్టరీ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చేతి వేలికి అయిన గాయం మరింత పెద్దది కావడంతో టీ20 ప్రపంచకప్‌లోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో అతడి స్థానాన్ని పొట్టి క్రికెట్‌లో షాట్లతో చెలరేగిపోయే హజ్రతుల్లా జాజాయ్‌తో భర్తీ చేశారు.

ఐసీసీ టెక్నికల్ కమిటీ అనుమతినివ్వడంతో ముజిబుర్ రెహ్మాన్ స్థానాన్ని ఆఫ్ఘనిస్థాన్ భర్తీ చేసింది. ఉగాండాతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో మాత్రమే ముజిబుర్ ఆడాడు. మూడు ఓవర్లు వేసి ఓ వికెట్ తీసుకున్నాడు. ఇక లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఇప్పుడు ముజిబుర్ పాత్రను పోషించనున్నాడు. నూర్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడాడు. పాపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన నూర్ 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
Mujeeb Ur Rahman
Afghanistan
T20 World Cup 2024
Hazratullah Zazai

More Telugu News