Chandrababu: చంద్రబాబు పాలన @ సచివాలయం.. టైమింగ్స్ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు!

Reports saying that Chandrababu will run the government from Secretariat
  • సెక్రటేరియెట్ వేదికగా పాలన కొనసాగించనున్న చంద్రబాబు
  • నిరంతరం అందుబాటులో ఉండేందుకు నిర్ణయం
  • మంత్రులు ప్రతి రోజూ సచివాలయానికి రావాలని దిశానిర్దేశం  
ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన మార్క్ పాలన అందించేందుకు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వంపై వ్యక్తమైన తీవ్ర విమర్శలను దృష్టిలో ఉంచుకున్న ఆయన... గతంలో మాదిరిగానే ఈసారి కూడా సచివాలయం కేంద్రంగా తన పాలన కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సెక్రటేరియెట్‌లోనే అందుబాటులో ఉంటానంటూ తనను కలిసిన పలువురు ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. గతంలో వ్యవహరించిన విధంగానే ఈసారి కూడా సచివాలయంలోనే నిరంతరం అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించబోతున్నట్టు ఆయన చెప్పారని తెలుస్తోంది. 

మంత్రులకు దిశానిర్దేశనం
సెక్రటేరియెట్ నుంచి పాలన అందించాలని నిర్ణయించన సీఎం చంద్రబాబు కేబినెట్ మంత్రులకు కూడా కీలక దిశానిర్దేశం చేశారు. మంత్రులు ప్రతి రోజూ సచివాలయానికి రావాలని, అదేవిధంగా సమయపాలన కచ్చితంగా పాటించాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని, పరిపాలన పరంగా సంపూర్ణ అవగాహన పొందాలని సూచించారు. సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన మంత్రులకు ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారని సమాచారం.
Chandrababu
Andhra Pradesh
AP Secretariat
Telugudesam

More Telugu News