Prithviraj: నటుడు పృథ్వీరాజ్‌కు షాక్.. నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ

Court Issues Non bailable arrest warrant for actor Prithviraj
షార్ట్స్‌లో చూడండి
‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ పేరిట మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి బుధవారం నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. 

భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను పాటించని పృథ్వీ హైకోర్టులో సవాలు చేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్‌, సప్పా రమేష్‌, సీహెచ్‌ వడ్డీకాసులును సంప్రదించి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశారు.

పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకాకుండా కేసు వివరాలను ఒక దినపత్రికలో ప్రకటన చేశారని, కోర్టుకు హాజరుకావడం లేదని లాయర్లు పిటిషన్‌లో వివరించారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి బుధవారం పిటిషన్‌ను పరిశీలించారు. పృథ్విరాజ్‌కు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ వారెంటు జారీ చేశారు. దీంతో పృథ్వీరాజ్ చిక్కుల్లో పడ్డట్టు అయింది.
Go Back to Shorts
Prithviraj
Non bailable Arrest Warrant
Vijayawada Family Court
Vijayawada
Tollywood
Movie News

More Telugu News