Narendra Modi: నిత్యవిద్యార్థిగా ఉండేవారే విజయం సాధిస్తారు: ప్రధాని మోదీ

Prime Minister Office should be a hub of service
  • పీఎంవో అధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ
  • నిత్యవిద్యార్థిగా ఉండటమే తమ విజయ రహస్యమని వ్యాఖ్య
  • ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల కోసమే పని చేయాలన్న మోదీ
నిత్య విద్యార్థిగా ఉండేవారే విజయం సాధిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం పీఎంవోలోని అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చాలామంది తన విజయ రహస్యం ఏమిటని అడుగుతుంటారని... నిత్య విద్యార్థిగా ఉండటమే తన విజయ రహస్యమని అన్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల కోసమే పని చేయాలన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షించారు. అనుకున్నది సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ప్రధాని కార్యాలయం సేవా కేంద్రంగా ఉండాలన్నారు.
Narendra Modi
BJP
PMO
NDA

More Telugu News