Chandrababu: చంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన మంత్రి పదవుల ఆశావహులు!

Minister posts aspirants rushes to Chandrababu residence
  • జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
  • చంద్రబాబుతో పాటు ప్రమాణం చేయనున్న మంత్రులు
  • మంత్రివర్గ కూర్పుపై తన నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఎల్లుండి (జూన్ 12) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు కూడా ప్రమాణం చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో, మంత్రి పదవుల ఆశావహులు నేడు చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు. కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలను కూడా దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు... మంత్రివర్గ కూర్పుపై తన నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. 

తొలిసారి ఎంపీగా గెలిచిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను కేంద్ర సహాయమంత్రి పదవికి ప్రతిపాదించినట్టుగానే... ఏపీలోనూ పలువురు కొత్తవారికి మంత్రులుగా చాన్స్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కేంద్రమంత్రివర్గంలో స్థానం దొరకని జనసేనకు ఏపీ క్యాబినెట్లో సముచిత ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.
Chandrababu
AP Cabinet
TDP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News