YSRCP: పది రోజుల్లోనే సీన్ మారిపోయింది... అందుకే ఓడిపోయాం: కాటసాని రాంభూపాల్ రెడ్డి

Katasani Rambhupal Reddy analyses reasons to YCP lose
  • ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం
  • వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఓ కారణమన్న కాటసాని
  • జగన్, అధికారులు తమ మాట వినుంటే గెలిచి ఉండేవాళ్లమని వెల్లడి
ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైసీపీ నేతలు ఇంకా కోలుకున్నట్టు లేదు. వారిని ఇప్పటికీ ఓటమి బాధ వేధిస్తూనే ఉంది. అంత దారుణంగా ఎలా ఓడిపోయామన్నది వారికి అర్థం కాని విషయంలా మారింది. అయితే, కొందరు మాజీ ఎమ్మెల్యేలు తమ ఓటమికి దారితీసిన అంశాలు ఇవేనంటూ మీడియా ముందుకు వస్తున్నారు. 

తాజాగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా స్పందించారు. వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఓ కారణమని విశ్లేషించారు. దీనిపై టీడీపీ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, రైతుల భూములు లాగేసుకుంటారన్న ప్రచారం తమకు వ్యతిరేకంగా మారిందని కాటసాని అభిప్రాయపడ్డారు. కేవలం పది రోజుల్లోనే సీన్ మారిపోయిందని అన్నారు. 

ఇసుక పాలసీ కూడా వైసీపీకి నష్టం కలుగజేసిందని తెలిపారు. ముఖ్యంగా... జగన్, అధికారులు తమ మాట వినుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ఎన్నికల్లో గెలిచేవాళ్లమని కాటసాని విచారం వ్యక్తం చేశారు.
YSRCP
Katasani
Panyam
TDP
Andhra Pradesh

More Telugu News