Narendra Modi: నరేంద్ర మోదీ కేబినెట్లో 27 మంది ఓబీసీలు, 5గురు మైనార్టీలు

Modi cabinet  have 72 ministers 11 of them from NDA allies

  • 72 మందితో మోదీ కొత్త కేబినెట్
  • 10 మంది ఎస్సీలకు, 5గురు ఎస్టీలకు చోటు
  • 43 మందికి గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం
  • 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పని చేసిన అనుభవం

నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీతో పాటు 72 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ కేబినెట్లో 27 మంది ఓబీసీలకు, 10 మంది ఎస్సీలకు, 5గురు ఎస్టీలు, 5గురు మైనార్టీలకు చోటు దక్కింది. 30 మందికి కేబినెట్ హోదా ఇచ్చారు. 5గురు సహాయ మంత్రులు (స్వతంత్ర), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ కేబినెట్లో 43 మందికి గతంలో కేంద్రమంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. మిత్రపక్షాలకు 11 కేబినెట్ పదవులు దక్కాయి.

More Telugu News