India-Pakistan: దాయాదుల క్రికెట్ యుద్ధం... భారత్ పై టాస్ గెలిచిన పాకిస్థాన్

Pakistan has won the toss against India in T20 World Cup clash
  • టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్ × పాకిస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
  • వర్షం కారణంగా మ్యాచ్ అరగంట ఆలస్యం
టీ20 వరల్డ్ కప్ లో నేడు అత్యంత ఆసక్తికర మ్యాచ్ కు తెరలేచింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. గ్రూప్-ఏలో భాగంగా జరుగుతున్న ఈ పోరు వర్షం కారణంగా ఆలస్యమైంది. దాంతో అరగంట ఆలస్యంగా టాస్ వేశారు. 

టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ పై తేమ, వాతావరణం మేఘావృతమై ఉండడంతో తమ బౌలర్లు రాణించే అవకాశాలున్నాయని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అభిప్రాయపడ్డాడు. 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, తాము టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించాడు. మరోవైపు పాక్ జట్టులో అజామ్ ఖాన్ కు విశ్రాంతినిచ్చారు. 

టీమిండియా...
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.

పాకిస్థాన్...
బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ఫఖార్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వాసిం, షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.
India-Pakistan
T20 World Cup 2024
Toss
New York
USA

More Telugu News