Puja Tomar: అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో పూజ సెన్షేషన్.. తొలి భారతీయురాలిగా రికార్డ్

Puja Tomar made history as the first Indian to win in WFC
  • యూఎఫ్‌సీలో బ్రెజిల్ క్రీడాకారిణి రయానేపై విజయం
  • యూఎఫ్‌సీలో భారత్‌కు ఇదే తొలి విజయం
  • తన విజయం ఇండియన్ ఫైటర్లు, ఫ్యాన్స్‌కు అంకితమన్న పూజ
అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ (యూఎఫ్‌సీ)లో బ్రెజిల్‌కు చెందిన రయానే డోస్ శాంతోస్‌ను ఓడించిన భారత్‌కు చెందిన పూజా తోమర్ చరిత్ర సృష్టించింది. యూఎఫ్‌సీని గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫరాబాద్‌కు చెందిన పూజ.. యూఎఫ్‌సీ కాంట్రాక్ట్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్‌గా గతేడాదే రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పుడు చాంపియన్‌గా నిలిచి అత్యంత అరుదైన రికార్డును తన పేరుపై రాసుకుంది. స్ట్రావెయిట్ డివిజన్‌లో రయానేపై 30-27, 27-30, 29-28 తేడాతో విజయం సాధించింది.

తొలి రౌండ్‌లో దూకుడు ప్రదర్శించిన పూజ, రెండో రౌండ్‌లో కొంత వెనుకబడినప్పటికీ మూడో రౌండ్‌లో పుంజుకుని ప్రత్యర్థిని చిత్తుచేసి విజయాన్ని అందుకుంది. పూజ తన విజయాన్ని ఇండియన్ ఫైటర్లు, అభిమానులకు అంకితమిచ్చింది. ఇండియన్ ఫైటర్స్ అంటే ఓటమి చెందేవాళ్లు కాదని నిరూపించాలనుకున్నానని పూజ పేర్కొంది. ఈ విజయం తన ఒక్కరిదే కాదని, భారత అభిమానులు, ఇండియన్ ఫైటర్స్‌ది అని పూజ వివరించింది.
Puja Tomar
UFC Championship
Brazil
Ultimate Fighting Championship

More Telugu News