Rahul Gandhi: వయనాడ్‌ను వదులుకోనున్న రాహుల్ గాంధీ?

Rahul Gandhi may leave Wayanad seat
  • వయనాడ్‌లోనే కొనసాగాలని కేరళ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి
  • యూపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాలన్న అధిష్ఠానం
  • అధిష్ఠానం సూచనల మేరకు ఓకే చెప్పిన కేరళ కాంగ్రెస్ నేతలు
  • వయనాడ్ నుంచి కేరళ సీనియర్ నేతను పోటీ చేయించాలని భావిస్తున్న కాంగ్రెస్
లోక్ సభ ఎన్నికలలో యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ నుంచి విజయం సాధించిన రాహుల్ గాంధీ రెండో సీటును వదులుకోనున్నట్లుగా తెలుస్తోంది. యూపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించడం కోసం ఈ సీటును అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నారు. వయనాడ్ నుంచి రెండోసారి గెలిపించినందున ఈ సీట్లోనే కొనసాగాలని కేరళ కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే యూపీపై దృష్టి సారించాల్సి ఉందన్న అధిష్ఠానం సూచనల మేరకు కేరళ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ తర్వాత అందుకు అంగీకరించారని తెలుస్తోంది.

శ‌నివారం జ‌రిగిన సీడబ్ల్యుసీ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లుగా చెబుతున్నారు. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించిన త‌ర్వాత మాత్రమే తుది ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, రాహుల్ గాంధీ వదులుకుంటే కనుక, అదే వ‌య‌నాడ్ నుంచి ప్రియాంకా గాంధీని పోటీ చేయించాలన్న విజ్ఞప్తిని కూడా గాంధీ కుటుంబం తిరస్కరించిందని చెబుతున్నారు. కేరళకు చెందిన సీనియర్ నేతను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని భావిస్తున్నారు.
Rahul Gandhi
Congress
Lok Sabha Election Results

More Telugu News