కంగనపై ప్రేమ తగ్గలేదు కానీ.. చెంపదెబ్బపై స్పందించిన షబానా ఆజ్మీ

Shabana Azmi reacts on Kangana Ranaut slap row
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగన రనౌత్‌కు చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన వ్యవహారంపై సీనియర్ నటి షబానా ఆజ్మీ స్పందించారు. ఈ ఘటనతో ఆమెపై తనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని చెప్తూనే, ఈ ఘటనతో సంబరాలు చేసుకుంటున్న వారి జాబితాలో తాను చేరబోనని స్పష్టం చేశారు. ప్రజలను రక్షించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఇక ప్రజలను రక్షించేది ఎవరని ఆవేదన వ్యక్తంచేశారు.

2020లో ఓ ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి విషయంలో చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ షబానా భర్త జావేద్ అక్తర్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ విషయంలో కంగన చిక్కులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా షబానా ఆజ్మీ ఇలా స్పందించారు.
Go Back to Shorts
Kangana Ranaut
Shabana Azmi
Javed Akhtar
Kangana Ranaut Slapped
Bollywood

More Telugu News