Ramoji Rao: ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో రామోజీ అంత్య‌క్రియ‌లు.. తెలంగాణ సర్కారు నిర్ణయం

Telangana Govt Decide Ramoji Rao Funeral with State Honours
  • సీడ‌బ్ల్యూసీ స‌మావేశాల కోసం ప్ర‌స్తుతం ఢిల్లీలో సీఎం రేవంత్ 
  • అక్క‌డి నుంచే రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారికి ఆదేశాలు
  • అంత్య‌క్రియ‌ల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌కు సీఎస్ ఆదేశాలు
మీడియా దిగ్గ‌జం రామోజీ రావు అంత్య‌క్రియ‌ల‌ను అధికారిక లాంఛ‌నాల‌తో నిర్వ‌హించాల‌ని తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం సీడ‌బ్ల్యూసీ స‌మావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ అక్క‌డి నుంచే రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేసిన‌ట్లు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో అంత్య‌క్రియ‌ల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌, సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌నర్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఓ మీడియా దిగ్గ‌జానికి ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నుండ‌టం దేశంలో ఇదే తొలిసారి.
Ramoji Rao
Funeral
Telangana Govt
State Honours

More Telugu News