మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకట రమణ కన్నుమూత
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరంగం వెంకట రమణ
- కనెటికట్ రాష్ట్రంలోని తన నివాసంలో కన్నుమూత
- అమెరికాలోనే ముగిసిన అంత్యక్రియలు
పాతికేళ్ల క్రితం అమెరికా వెళ్లిన వెంకట రమణ, ఫైజర్ కంపెనీ పరిశోధన విభాగంలో పనిచేస్తున్నారు. శ్రీరంగం వెంకట రమణకి భార్య మాధవి, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె కవిత ఉన్నారు. ఆయన భార్యది పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గణపవరం గ్రామం. వెంకట రమణ మృతిపట్ల సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు. మహాకవి శ్రీశ్రీ భార్య సరోజా శ్రీశ్రీ 80 సంవత్సరాల వయస్సులో కుమారుడిని కోల్పోయారని, ఆమెకు, వెంకటరమణ కుటుంబ సభ్యులకు సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు.