Pattabhi: థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఆ ఎస్పీని కలిసేందుకు వెళితే ఆయన లేరు... ఆసక్తికర వీడియో పంచుకున్న పట్టాభి

TDP Spokes Person Pattabhi shares a video
  • గతంలో పట్టాభిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అర్ధరాత్రి కరెంట్ తీసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న పట్టాభి
  • ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఆ ఎస్పీ అదృశ్యమయ్యాడని వెల్లడి 
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. గతంలో నన్ను అరెస్ట్ చేసి రాచమర్యాదలు చేసిన ఓ పోలీస్ అధికారిని కలిసేందుకు వెళితే ఆయన లేరని, దాంతో అక్కడే కుర్చీలో ఫ్లవర్ బొకే, శాలువా ఉంచి వచ్చేశానని తెలిపారు. ఆ పోలీస్ అధికారి గెస్ట్ హౌస్ ను తాను సందర్శించిన వీడియోను కూడా పట్టాభి పంచుకున్నారు. 

"2023 ఫిబ్రవరి 20వ తేదీన అరెస్ట్ చేసి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పీఎస్ లో నిర్బంధించి అర్ధరాత్రి కరెంటు తీసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాచమర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారిని కలిసేందుకు ఈ రోజు ఆయన ఏడున్నర ఎకరాల విలాసవంతమైన అతిథి గృహానికి వెళ్లాను. కానీ ఆయన అక్కడ లేరు. 

జాషువా గారి ఇలాంటి రాచమర్యాదలకు మెచ్చి గతంలో పుంగనూరు పుడింగ్ గారు చిత్తూరు జిల్లా పోస్టింగ్ వేయించుకున్నారు. కానీ ఆ కుట్రలు తెలుసుకున్న ఎన్నికల సంఘం అతడిని విధుల నుంచి తప్పించింది. 

దాంతో అతడు ప్రస్తుతం విజయవాడలోని తన గెస్ట్ హౌస్ లో ఉన్నారని తెలుసుకుని, వారికి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కారం చేయాలని అక్కడికి వెళితే... నిన్న ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన సెల్ ఫోన్ స్విచాఫ్ చేసి అదృశ్యమయ్యారని తెలిసింది. 

వారి అతిథి గృహంలోనే ఒక కుర్చీలో పుష్పగుచ్ఛం, శాలువా ఉంచి... నా వీడియో సందేశాన్ని ఎస్పీ గారి సెల్ ఫోన్ కు పంపించాను" అంటూ పట్టాభి వివరించారు.
Pattabhi
SP Jashua
TDP
Police
Andhra Pradesh

More Telugu News