Kalyan Ram: ఏపీలో టీడీపీ అఖండ విజయంపై కల్యాణ్ రామ్ ఆసక్తికర ట్వీట్

Kalyan Ram said that A great success that will remain in history on TDP Victory in AP
  • చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకి అభినందనలు అంటూ కల్యాణ్ రామ్ ట్వీట్
  • బాబాయ్ బాలయ్య, అత్తయ్య పురందేశ్వరి, నారా లోకేశ్, శ్రీభరత్‌లకు కూడా అభినందనలు
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కచ్చితంగా మెరుగుపడుతుందని ఆశాభావం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అఖండ విజయం సాధించిన ఎన్డీయే కూటమి నేతలపై అభినందనల జల్లు కురుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులు తమ అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో దివంగత నందమూరి హరికృష్ణ తనయుడు కల్యాణ్ రామ్ కూడా చేరిపోయాడు. చరిత్రలో నిలిచిపోయే ఘన విజయాన్ని సాధించిన నారా చంద్రబాబు నాయుడు మావయ్యకి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానంటూ కల్యాణ్ రామ్ బుధవారం ట్వీట్ చేశాడు. 

‘‘మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను. వరుసగా మూడవ సారి హిందూపురం ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్‌కు శుభాకాంక్షలు. అలాగే భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేశ్, శ్రీభరత్, అత్తయ్య దగ్గుబాటి పురందేశ్వరి గారికి  నా శుభాకాంక్షలు’’ అని కల్యాణ్ రామ్ పేర్కొన్నాడు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పటికే వీరందరికీ శుభాకాంక్షలు తెలిపిన సంగతి విదితమే.  
Kalyan Ram
Telugudesam
AP Assembly Poll Results
Jr NTR
Andhra Pradesh

More Telugu News