Narendra Modi: ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోదీ

PM Modi meets President Droupadi Murmu submits resignation
  • మోదీ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము
  • కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని కోరిన రాష్ట్రపతి
  • ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని రాష్ట్రపతి కోరారు. మోదీ ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వతంత్ర భారతంలో వరుసగా మూడోసారి ప్రధాని కావడం నెహ్రూ తర్వాత మోదీయే కావడం గమార్హం.
Narendra Modi
Droupadi Murmu
Prime Minister
BJP

More Telugu News