Amaravati: టీడీపీ కూటమి విజయంతో సంబరాల్లో అమరావతి రైతులు

Amaravati farmers celebrations after TDP alliance victory
  • ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బంపర్ విక్టరీ
  • సంబరాల్లో రైతులు, రైతు కూలీలు, మహిళలు
  • అమరావతి కోసం 1631 రోజుల సుదీర్ఘ ఉద్యమం
  • వైసీపీ ఓటమితో వీధుల్లోకి వచ్చి రంగులు పూసుకుంటూ సంబరాలు
అమరావతి మళ్లీ నవ్వింది. ఐదేళ్లపాటు నిరాశ, నిస్పృహల మధ్య నలిగిపోయిన అమరావతి ప్రజలు నిన్నటి అసెంబ్లీ ఫలితాల తీర్పుతో సంబరాలు చేసుకున్నారు. అమరావతిని కాపాడుకునేందుకు 1631 రోజుల సుదీర్ఘ ఉద్యమం చేసిన రైతులు వైసీపీ దారుణ ఓటమితో సంతోషాల్లో మునిగిపోయారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు సంబరాల్లో పాలుపంచుకున్నారు. 

ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతికి తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తారంటూ ఆనందం పంచుకున్నారు. ఐదేళ్ల కష్టాలు ఈడేరాయంటూ ఆనందంతో కన్నీళ్లు రాల్చారు. పసుపు రంగు టీషర్టులు ధరించి వీధుల్లోకి వచ్చి పసుపు రంగులు పూసుకొంటూ జయహో అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి బంపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే.
Amaravati
AP Capital
Telugudesam
BJP
Janasena

More Telugu News