Konda Surekha: ఆ కార‌ణంగానే జ‌గ‌న్ ఓట‌మి పాల‌య్యారు: తెలంగాణ మంత్రి కొండా సురేఖ

Telangana Minister Konda Surekha Comments on YS Jagan Defeat
  • కక్ష సాధింపు చ‌ర్య‌ల కార‌ణంగానే జ‌గ‌న్‌ ఓట‌మి పాల‌య్యార‌న్న కొండా సురేఖ
  • చంద్ర‌బాబును జైలుకి పంపించిన రోజే వైసీపీ ఓట‌మి ఖాయ‌మైందని వ్యాఖ్య‌
  • ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రానుండ‌డం అక్క‌డి ప్రజ‌ల అదృష్ట‌మ‌న్న మంత్రి
ఏపీలో వైఎస్ జ‌గ‌న్ ఓట‌మిపై తెలంగాణ రాష్ట్ర‌ అట‌వీ, దేవాదాయ శాఖ‌ మంత్రి  కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కక్ష సాధింపు చ‌ర్య‌ల కార‌ణంగానే ఆయ‌న ఓట‌మి పాల‌య్యార‌ని తెలిపారు. "చంద్ర‌బాబును జైలుకి పంపించిన రోజే వైసీపీ ఓట‌మి ఖాయ‌మైంది. కక్ష సాధింపు చ‌ర్య‌లతోనే జ‌గ‌న్ ఓట‌మి పాల‌య్యారు" అని మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖ అన్నారు. అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రానుండ‌డం అక్క‌డి ప్రజ‌ల అదృష్ట‌మ‌ని పేర్కొన్నారు. 

మంగ‌ళ‌వారం వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్థానం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అభ్య‌ర్థి క‌డియం కావ్య‌ను మంత్రి అభినందించారు. అనంత‌రం వ‌రంగ‌ల్ ఎనుమాముల వ్య‌వ‌సాయ‌ మార్కెట్ యార్డులోని ఓట్ల లెక్కింపు కేంద్రం వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. దేశ‌వ్యాప్తంగా ఇండియా కూట‌మికి మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని మంత్రి సురేఖ తెలిపారు.
Konda Surekha
YS Jagan
YSRCP
Andhra Pradesh
Telangana
Congress

More Telugu News