TDP Leaders: ఏపీలో టీడీపీ హ్యాట్రిక్ గెలుపు వీరులు వీరే!

TDP Leaders who got Hattrick Victory
  • ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ ప్ర‌భంజ‌నం
  • ఒంట‌రిగానే 130కి పైగా స్థానాల్లో ఆధిక్యం
  • టీడీపీ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద విజ‌యం
  • పార్టీలోని అచ్చెన్నాయుడు, బుచ్చ‌య్య చౌద‌రి, బాల‌కృష్ణ త‌దిత‌ర నేత‌ల హ్యాట్రిక్ విజ‌యం
ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ ప్ర‌భంజ‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఒంట‌రిగానే 130కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించింది. టీడీపీ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద విజ‌యం దిశగా దూసుకెళ్తున్న ఆ పార్టీలో ప‌లువురు నేత‌లు హ్యాట్రిక్ విజ‌యం సాధించారు. 

ఈ జాబితాలో టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, నిమ్మ‌ల రామానాయుడు, చిన‌రాజ‌ప్ప‌, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, ఏలూరి సాంబ‌శివ‌రావు, గొట్టిపాటి ర‌వి, గ‌ద్దె రామ్మోహ‌న్‌, నంద‌మూరి బాల‌కృష్ణ ఉన్నారు. వీరంద‌రూ హ్యాట్రిక్ గెలుపు రుచి చూశారు.
TDP Leaders
Andhra Pradesh
AP Politics

More Telugu News