Botsa Satyanarayana: వెనుకంజ‌లో మంత్రి బొత్స సత్యనారాయణ

YCP Leader Botsa Satyanarayana Trial in Cheepurupalli Assembly constituency
  • చీపురుపల్లిలో కూట‌మి అభ్య‌ర్థి కళా వెంకట్రావు ఆధిక్యం 
  • బొత్స‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్న వెంకట్రావు
  • మొదటి రౌండ్‌ ఫలితాల్లో  వెనుక‌బ‌డ్డ వైసీపీ నేత‌
వైసీపీ పార్టీలో అత్యంత కీలక నేతలలో బొత్స సత్యనారాయణ ఒకరు. చీపురుపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ఆయ‌న ప్ర‌స్తుతం వెనుకంజ‌లో ఉన్నారు. ఇక్క‌డ కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. బొత్స‌ వైసీపీ కీలక నేత కావడం, మంత్రిగా పని చేసి ఉండడంతో ఈయనకు ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. కాకపోతే వెంకట్రావు ఈ సారి ఈయనకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంద‌ని చాలా మంది అనుకున్నారు. అనుకున్నట్టే వెంకట్రావు ఈయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. తాజాగా చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మొదటి రౌండ్ల ఫలితాలు వెలువడిన సమయంలో బొత్స సత్యనారాయణ వెనుకబడి ఉండగా , వెంకట్రావు ముందంజలో ఉన్నారు. మరి ఈ లీడ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? లేక బొత్స ముందుకు వస్తారా? అనేది చూడాలి.
Botsa Satyanarayana
YSRCP
Cheepurupalli Assembly
Andhra Pradesh

More Telugu News