Telangana: తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కాం... మాజీ ఓఎస్డీ అరెస్ట్

Former OSD arrested in sheep distribution scam
  • పశుసంవర్ధక శాఖ మాజీ సీఈతో పాటు మాజీ ఓఎస్డీ అరెస్ట్ 
  • రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులను రాంచందర్ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు
  • ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు
  • రెండువారాల రిమాండ్ విధించిన న్యాయమూర్తి
తెలంగాణలో జరిగిన గొర్రెల పంపిణీ స్కాంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఇద్దరు అధికారులను అరెస్ట్ చేశారు. పశుసంవర్ధక శాఖ మాజీ సీఈ రాంచందర్ రావు, మాజీ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ అరెస్టయ్యారు. గొర్రెల పంపిణీ పేరుతో రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులను రాంచందర్ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఏసీబీ ఆధికారులు వారిద్దరినీ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రెండు వారాల రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. గొర్రెల స్కాంకు సంబంధించి ఇప్పటి వరకు ఏసీబీ ఆధికారులు పదిమందిని అరెస్ట్ చేశారు.
Telangana
Crime News

More Telugu News