Vishwak Sen: టికెట్లు కొన్నవారికే 'బుక్ మై షో'లో రేటింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి: విష్వక్సేన్

Vishwaksen attends press meet on Gangs Of Godavari release day
  • విష్వక్సేన్ హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం
  • ఉదయం 6 గంటలకే రివ్యూలు వచ్చేశాయన్న విష్వక్సేన్
  • సినిమా చూడకుండానే రివ్యూలు ఇచ్చేశారని ఆవేదన
టాలీవుడ్ యువ నటుడు విష్వక్సేన్ కథానాయకుడిగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. 

ఈ ప్రెస్ మీట్ లో హీరో విష్వక్సేన్ మాట్లాడుతూ, తమ చిత్రంపై ఉదయం 6 గంటలకే రివ్యూలు వచ్చేశాయని, దీన్ని బట్టి వారు సినిమా చూడకుండానే రివ్యూలు ఇచ్చారన్న విషయం అర్థమవుతోందని అన్నారు. టికెట్లు కొన్నవారికే బుక్ మై షోలో రేటింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో సంగీతం బాగా లేదని కొందరు రివ్యూలు ఇచ్చారని, అయితే సినిమా చూసి అందులో బాగాలేని అంశాన్ని ప్రస్తావిస్తే ఫర్వాలేదని, కానీ సినిమా చూడకుండానే రివ్యూలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో విష్వక్సేన్, నేహాశెట్టి, అంజలి, నాజర్, సాయికుమార్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి గీత రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టయిన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
Vishwak Sen
Gangs Of Godavari
Release
Reviews
Tollywood

More Telugu News