ఎల్లుండి లొంగిపోతున్నా... ఈసారి జైల్లో మరింత వేధింపులకు గురిచేయవచ్చు: అరవింద్ కేజ్రీవాల్
- నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడేందుకు జైలుకు వెళుతున్నానన్న కేజ్రీవాల్
- జైల్లో ఉన్నప్పుడు మెడిసిన్ అందకుండా అడ్డుపడ్డారని ఆరోపణ
- జైలుకు వెళ్లిన తర్వాత ఎక్కువగా ప్రజల గురించే ఆలోచిస్తానన్న కేజ్రీవాల్
నియంతృత్వం నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు తాను జైలుకు వెళుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు మెడిసిన్ అందకుండా అడ్డుపడ్డారని... దీంతో అరెస్టైనప్పుడు 70 కిలోలు ఉన్న తాను... ఆరు కిలోలు తగ్గినట్లు చెప్పారు. కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తనకు సూచించారని... అంతర్గతంగా ఉన్న తన ఆరోగ్య పరిస్థితికి ఇది సంకేతం కావొచ్చునని వ్యాఖ్యానించారు.
ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇంటి నుంచి బయలుదేరి పోలీసుల ఎదుట లొంగిపోతానని కేజ్రీవాల్ తెలిపారు. ఈసారి తనను ఇంకా వేధింపులకు గురి చేయవచ్చునన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత ఎక్కువగా ప్రజల గురించే ఆలోచిస్తానని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు అందుతున్న సేవల్లో ఎలాంటి మార్పు ఉండదని హామీ ఇచ్చారు. మీకోసం ఓ కొడుకులా పని చేశానన్నారు. ప్రజలను తాను అభ్యర్థించేది ఒక్కటేనని... అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.