Air India Hostess: రహస్య భాగాల్లో బంగారం దాచుకుని స్మగ్లింగ్.. ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్ అరెస్ట్

Air hostess arrested in Kerala after nearly 1 kg gold found in her rectum
  • ఈ నెల 28న మస్కట్ నుంచి కన్నూరు‌ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం
  • బంగారంతో పట్టుబడిన ఎయిర్‌హోస్టెస్ సురభి ఖాతూన్
  • గతంలోనూ బంగారం స్మగ్లింగ్ చేసినట్టు అనుమానం
  • 14 రోజుల కస్టడీకి కోర్టు ఆదేశం
బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎయిర్ హోస్టెస్ దొరికిపోయింది. 960 గ్రాముల బంగారాన్ని ఆమె రహస్య అవయవాల్లో దాచుకుని వస్తుండగా కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తెలిపారు. 

నిందితురాలిని సురభి ఖాతూన్‌గా గుర్తించారు. ఈ నెల 28న విమానం మస్కట్ నుంచి కన్నూరు చేరుకుంది. ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల కస్టడీకి ఆదేశించారు. నిందితురాలు సురభి బంగారాన్ని అక్రమంగా తీసుకురావడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ పలుమార్లు ఇలా స్మగ్లింగ్ చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
Air India Hostess
Kerala
Rectum
Gold Smuggling

More Telugu News